నవతెలంగాణ – హైదరాబాద్: నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రతి శనివారం అప్‌డేట్స్ ఇస్తున్న మేకర్స్.. ఈ శనివారం ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఆగస్టు 13న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ అప్‌డేట్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాని.. ‘చినుకులతో మొదలవుతుంది.. తుఫానుతో ముగుస్తుంది’ అని ట్వీట్ చేయడంతో ట్రైలర్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఇందులో సూర్య పాత్రలో రగ్డ్ క్యారెక్టర్ చేస్తున్న నాని.. శనివారాల్లో మాత్రమే వైలెంట్‌గా ఉంటాడు. మిగతా రోజుల్లో కూల్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, సాయి కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 29న పాన్ ఇండియా వైడ్‌గా సినిమా విడుదల కానుంది.