క్వార్టర్స్‌లో సాత్విక్‌ జోడీ

Satvik pair in the quarters– ప్రణయ్‌, గాయత్రి జోడీ పరాజయం
– మలేషియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌
కౌలాలంపూర్‌ (మలేషియా): భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్స్‌ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ కొత్త ఏడాదిలో సరికొత్త జోష్‌ చూపిస్తున్నారు. పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌, చిరాగ్‌లు క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్‌ఫైనల్లో మలేషియా జోడీ నూర్‌ మహ్మద్‌, టాన్‌ వీలపై వరుస గేముల్లో గెలుపొందారు. 43 నిమిషాల్లోనే ముగిసిన పోరులో సాత్విక్‌, చిరాగ్‌లు 21-15, 21-15తో చెలరేగారు. నేడు సెమీఫైనల్లో బెర్త్‌ కోసం మలేషియా జోడీతేనే తలపడనున్నారు. పురుషుల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. లక్ష్యసేన్‌ ఇదివరకే నిరాశపరచగా.. హెచ్‌.ఎస్‌ ప్రణరు ప్రీ క్వార్టర్స్‌లో తేలిపోయాడు. చైనా షట్లర్‌ షి ఫెంగ్‌ (7) చేతిలో మూడు గేముల్లో పోరాడి ఓడాడు. 8-21, 21-15, 21-23తో ప్రణరు ఆఖరు వరకు గట్టి పోటీ ఇచ్చాడు. మహిళల డబుల్స్‌లో ట్రెసా జాలి, పుల్లెల గాయత్రిలు 21-15, 8-21, 19-21తో మూడు గేముల మ్యాచ్‌లో పరాజయం పాలయ్యారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కపిల ధ్రువ్‌, తనీశ క్రాస్టో జంట 13-21, 20-21తో తేలిపోగా.. సతీశ్‌ కుమార్‌, ఆద్య జంట సైతం 10-21, 17-21తో నిరాశపరిచింది. మహిళల సింగిల్స్‌లో మాళవిక బాన్సోద్‌ 18-21, 1-21తో మూడో సీడ్‌ చైనా షట్లర్‌ చేతిలో ఓటమి చెందింది. దీంతో మెన్స్‌ డబుల్స్‌ మినహా అన్ని విభాగాల్లో భారత షట్లర్ల పోరాటానికి తెరపడింది.

Spread the love