సెమీస్‌లో సాత్విక్‌ జోడీ

– క్వార్టర్స్‌లో జపాన్‌ జంటపై గెలుపు
– కొరియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
యోషు (దక్షిణ కొరియా) : ఆసియా చాంపియన్స్‌, భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టిలు కొరియా ఓపెన్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో సాత్విక్‌, చిరాగ్‌ జోడీ 21-14, 21-17తో వరుస గేముల్లో గెలుపొందారు. ఐదో సీడ్‌ జపాన్‌ షట్లర్లు టకురో హోకి, యుగో కొబొహసిలు 40 నిమిషాల్లోనే భారత జోడీకి సెమీస్‌ బెర్త్‌ అప్పగించారు. తొలి గేమ్‌లో సాత్విక్‌, చిరాగ్‌ ఏకపక్ష విజయం సాధించగా.. రెండో గేమ్‌లో జపాన్‌ జోడీ ప్రతిఘటించింది. 11-9తో విరామ సమయానికి ముందంజలో నిలిచిన సాత్విక్‌, చిరాగ్‌లను..16-16తో స్కోరు సమం చేసిన జపాన్‌ జోడీ ఉత్కంఠ రేపారు. చివర్లో వరుస పాయింట్లు సాధించిన సాత్విక్‌, చిరాగ్‌ సెమీస్‌లోకి అడుగుపెట్టారు. నేడు ఫైనల్లో చోటు కోసం రెండో సీడ్‌ చైనా జోడీ వీ కెంగ్‌, వాంగ్‌ చాంగ్‌లతో పోటీపడనున్నారు.

Spread the love