నవతెలంగాణ- అచ్చంపేట : తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఒకటి మద్దిమడుగు ఆంజనేయ స్వామి ఆలయం లో ఆంజనేయ స్వాములు ఇరుముడి కార్యక్రమం నేటి నుంచి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. 26వ తేదీ వరకు దీక్ష మాల విరమణ ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ వారి ఆర్థిక సహాయంతో డిసెంబర్ 25న ఆలయ ప్రాంగణంలో అచ్చంపేట తాలూకా కళాకారుల చేత ఉచితంగా శ్రీ సత్య హరిచంద్ర నాటకం ప్రదర్శించడం జరుగుతుందని కళాకారుడు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నరసయ్య యాదవ్ శుక్రవారం తెలిపారు. భక్తులు, వారి కుటుంబ సభ్యులు ఉచిత హరిచంద్ర నాటకం ప్రదర్శనను తిలకించగలరు.