నవతెలంగాణ – నసురుల్లాబాద్
బాన్సువాడ డివిజనల్ పోలీస్ అధికారిగా సత్యనారాయణ హైదరాబాదులో డీఎస్పీ ఇంటెలిజెన్స్ విభాగంలో విధులు నిర్వహించి బదిలీ ప్రక్రియలో భాగంగా శనివారం బాన్సువాడ డీఎస్పీ గా సత్యనారాయణ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. నూతన డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణ గారికి బాన్సువాడ డివిజన్ పరిధి పోలీస్ అధికారులు వచ్చి శుభాకాంక్షలు అభినందించారు. ఈ సందర్భంగా నూతనడీఎస్పీ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పాటు పడతానని, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. డివిజన్ ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు.