నవతెలంగాణ – భువనగిరి
ఆలిండియా లాయర్స్ యూని యన్ రాష్ట్ర మహాసభలో 47 మందితో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నట్టు ఆల్ ఇండియా కార్యదర్శి సురేంద్రనాథ్ ప్రకటిం చారు. భువనగిరిలో ఈ నెల 17, 18న రాష్ట్ర మహాసభ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవాధ్యక్షు లుగా విద్యాసాగర్, అధ్యక్షులుగా కొల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కె.పార్థసారథి, కోశాధికారిగా ఈ.వేణు గోపాల్ రావు ఎన్నికయ్యారు. ఉపాధ్య క్షులుగా చంద్రశేఖర్ ఆజాద్ (రంగా రెడ్డి), వనగంటి నాగేశ్వరరావు (వన పర్తి), సిహెచ్.శైల (పెద్దపల్లి), శ్రీని వాసరావు (ఖమ్మం), సహాయ కార్య దర్శిగా పి.రామ చంద్రా రెడ్డి(హైదరా బాద్), ఎం.శ్రీనివాసరావు (ఖమ్మం), పి.కిషన్ (భద్రాద్రి కొత్తగూడెం), ఎండి.ఇస్మైల్ అహ్మద్ (భువనగిరి), మోత్కూరు వనజను ఎన్నుకున్నారు. భువనగిరి నుంచి ప్రత్యేక ఆహ్వనితు లుగా నాగారం అంజయ్యను ఎన్నుకు న్నారు.
ఈ సందర్భంగా సురేంద్రనాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడా చట్టాలను సాధించు కునే దిశగా తమ కార్యాచరణ ఉండా లని, ఆ విధంగా కొత్త కమిటీ పని చేయాలని సూచించారు. మహాసభలో చేసిన తీర్మానాల అమలు కోసం కమిటీ కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్లాలన్నారు.
తీర్మానాలు
రాష్ట్రంలో అడ్వకేట్ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి
జూనియర్ న్యాయవాదులకు 10,000 స్టైఫండ్ ఇవ్వాలి
డెత్ బెనిఫిట్ నాలుగు లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలి
41 ఏసీఆర్‌పీసీ దుర్వినియోగాన్ని అరికట్టాలి
నూతనంగా ఏర్పడిన జిల్లా కోర్టుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
లా అకాడమీ ఏర్పాటు చేయాలి.