కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగం: సత్యవతి రాథోడ్

నవతెలంగాణ – నర్సంపేట
తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగంలా సాగుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నిర్వహించిన ‘సంక్షేమ పథకాల పండుగ ‘ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి సత్యవతి మాట్లాడారు. నాడు సంక్షేమ పథకాలను ఎన్టీఆర్ అమలు చేస్తే నేడు ప్రతి ఇంటా కేసీఆర్ సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని తెలిపారు. సామాన్యుడు సగౌరవంగా నిలబడాలని కేసీఆర్ సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడని తెలిపారు. 10 యేండ్ల కాంగ్రెస్ పాలనలో గిరిజన సంక్షేమానికి కేవలం రూ.6వేల కోట్లు ఖర్చు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం రూ.53వేల కోట్లను ఖర్చు చేశాడన్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి కేవలం రూ.100 మాత్రమే కేటాంచడం బాధకరమని ఎద్దేవా చేశారు. దశాబ్ది ఉత్సవాలలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషాన్ని ఇస్తుందని సంతృప్తి వ్యక్తం చేశారు. నిండు మనస్సుతో కేసీఆర్ ను దీవించి మద్దతును ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పీ.ప్రావీణ్య, తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Spread the love