స‌త్యేంద‌ర్ జైన్‌కు తాత్కాలిక బెయిల్..

నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత స‌త్యేంద‌ర్ జైన్‌కు సుప్రీంకోర్టు ఇవాళ తాత్కాలిక బెయిల్ మంజూరీ చేసింది. మెడిక‌ల్ గ్రౌండ్‌పై ఆ బెయిల్ ఇస్తున్న‌ట్లు కోర్టు చెప్పింది. ఆరోగ్యం క్షీణించిన జైన్ ప్ర‌స్తుతం ఢిల్లీలోని లోక్ నాయ‌క్ హాస్పిట‌ల్ ఐసీయూలో ఆక్సిజ‌న్ స‌పోర్ట్‌పై చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే. ఆరు వారాల పాటు బెయిల్ మంజూరీ చేస్తున్న‌ట్లు కోర్టు వెల్ల‌డించింది. అయితే కొన్ని ష‌ర‌తులు విధించింది. బెయిల్ తీసుకున్న స‌మ‌యంలో స‌త్యేంద‌ర్ జైన్‌.. మీడియాతో మాట్లాడ‌రాదు అని, ఢిల్లీ విడిచి వెళ్ల‌రాదు అని ఆదేశించింది. తీహార్ జైలులోని బాత్‌రూంలో గురువారం ఉద‌యం మాజీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌ కుప్ప‌కూలిన ఆయ‌న్ను అనంత‌రం దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆపై మెరుగైన చికిత్స‌ను అందించేందుకు ఎన్‌జేపీ ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అక్క‌డ వైద్యులు ఆయ‌న‌కు ఆక్సిజ‌న్ స‌పోర్ట్ అందించారు. ఆరోగ్య స‌మ‌స్య‌లు తలెత్త‌డంతో సత్యేంద‌ర్ జైన్‌ను ఆస్ప‌త్రికి తీసుకురావ‌డం ఈ వారంలో ఇది రెండవ‌సారి. గురువారం ఉద‌యం ఆరు గంట‌ల స‌మ‌యంలో సెల్ నెంబ‌ర్ 7లోని బాత్‌రూంలో జైన్ కుప్ప‌కూలార‌ని తీహార్ జైల్ డీజీ తెలిపారు. దీంతో ఆయ‌న‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అక్క‌డ ప‌లు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించార‌ని చెప్పారు. స‌త్యేంద‌ర్ జైన్‌కు వెన్నెముక స‌ర్జ‌రీ చేయాల్సి ఉంద‌ని ఆయ‌న తెలిపారు.

Spread the love