కాపాడుకోండిలా…

కాపాడుకోండిలా...వయసు పెరుగుతున్న కొద్దీ మీ చర్మంలో మార్పులు వస్తాయి. ఆ మార్పులకు తగినట్టుగా మీరు మీ చర్మాన్ని సంరక్షించుకోవాలి.
– మంచి ఆరోగ్యకరమైన చర్మం కోసం నాలుగు పద్ధతులను ఎల్లప్పుడూ అనుసరించండి. మొదటిది.. నీరు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. రెండవది.. వ్యాయామం ద్వారా శరీరాన్ని ఆరోగ్య వంతంగా చేసుకోండి. మూడవది.. ఒత్తిడి, శ్రమను తగ్గించడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఇక చివరిది.. మీ చర్మానికి అవసరమైనపుడు ట్రీట్మెంట్‌ చేయించి చర్మాన్ని కాపాడండి. ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే ఇవన్నీ పాటించాలి.
– నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు అన్నీ చర్మానికి మేలు చేస్తాయి. నీటితో కూడిన ఆహారాన్ని తీసుకున్నప్పుడు చర్మం లోపలి నుండి ఎక్కువసేపు హైడ్రేట్‌గా ఉంటుంది. మీ ఆహారాలలో ఆపిల్‌, కీర దోసకాయలు, ద్రాక్ష మొదలైనవి చేర్చాలి. సూర్యరశ్మిలో చర్మాన్ని కాపాడే లక్షణాలు ఉంటాయి.
– ఎలక్ట్రానిక్స్‌ని ఎక్కువసేపు ఉపయోగించినప్పుడు వాటి నుండి వెలువడే నీలి రంగు లైట్‌ మీపై పడకుండా ఉండటం కోసం అద్దాలు ధరించడం వంటి చిన్న మార్పులు చేయండి. ఎలక్ట్రానిక్స్‌ నుండి విశ్రాంతి తీసుకోవడానికి టైమర్‌లను సెట్‌ చేసుకోండి. విశ్రాంతి తీసుకునే సమయాన్ని పెంచడానికి ప్రయత్నించండి.

Spread the love