పురుషులతో సమానంగా స్త్రీలు రక్తదానం..
మాదాపూర్ డీసీపీి కె .శిల్పవల్లి
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
రక్తదానంతో ఒక ప్రాణాన్ని కాపాడవచ్చని మాదా పూర్ డీసీపీ కె.శిల్పవల్లి అన్నారు. కోఠి ఉస్మానియా మెడి కల్ కళాశాలలో వరల్డ్ డోనర్స్ డే, తెలంగాణ దశాబ్ది ఉత్స వాలను పురస్కరించుకొని ఓఎంసీ కేర్స్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ఆమె ముఖ్య అతి థి గా పాల్గొని ప్రారంభించారు. ఆమె రక్తదానం చేశారు. అన ంతరం మాట్లాడుతూ మహిళలు కూడా పురుషులతో సమానంగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఉస్మానియా మెడి కల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం ప్రతి ఒక్కరు చేయాలని సూచి ంచారు. ప్రతి రెండు సెకన్లలో భారతదేశంలో ఒకరికి రక్తం అవసరమ వుతుందని, జీవిత కాలంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి రక్తం అవసరమవుతుందన్నారు. యూనిట్ రక్తం ముగ్గురి ప్రా ణాలు కాపాడుతుంది అని తెలిపారు. ఓఎంసీ కేర్స్ ఉపాధ్య క్షురాలు సత్యక్షి మాట్లాడుతూ ప్రజలు,యు వత రక్తదానంపై ఉన్న అపోహలు విడనాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియామెడికల్ కళాశాల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ రెడ్డి, డాక్టర్ అనిత బల్ల, డాక్టర్ ఎన్ జయ, ఓఎంసీ కేర్స్ చైర్పర్సన్స్ ఫైజాన్ ఉల్హుస్సేన్ మ హమ్మద్ అబ్దుల్ ఆఫీస్ మమ్మద్, ఉపాధ్యక్షురాలు సత్యక్షి, ప్రతినిధులు సంజనరెడ్డి, ప్రతినిధులు, విద్యార్థులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.్చ