నా భార్య నుండి నన్ను రక్షించండి..

నవతెలంగాణ – హైదరాబాద్ : ఏపీ రాజోలుకు చెందిన టెమూజియన్‌కు అమలాపురానికి చెందిన లక్ష్మి గౌతమితో ఏడేళ్ల కిందట పెళ్లి జరిగింది. టెమూజిన్‌ మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. అయితే..పెళ్లయిన నాటి నుంచి భార్య తనను అకారణంగా హింసిస్తుందని.. పలుమార్లు పెద్దల సమక్షంలో మాట్లాడినా తీరు మారడం లేదన్నారు. తన భార్య నిత్యం కొడుతుందని.. ఆమె నుంచి తనతో పాటు తల్లిదండ్రులకు ప్రాణ హాని ఉందని.. తమను కాపాడాలంటూ ఓ భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్‌లో చోటు చేసుకున్నది.  ఇటీవల తనను చంపేందుకు కత్తితో దాడి చేసిందని చెప్పాడు. ఈ విషయంపై స్థానిక అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపాడు. అయితే, పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఓ చట్టం, పురుషులకు ఓ చట్టం ఉంటుందా? అంటూ ప్రశ్నించాడు. తాను నిన్నటి నుంచి ఇంటికి వెళ్లలేదని.. వెళ్తే మళ్లీ భార్య తనపై దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసులు భార్యపై చర్యలు తీసుకోవడంతో పాటు తనకు రక్షించాలని వేడుకున్నాడు. అయితే పోలీసులు ఆమెను విచారించగా నాభర్త చెప్పిన దాంట్లో నిజం లేదని,  నిజానిజాలు ఏంటో విచారణ చేయాలని కోరింది.

Spread the love