ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సావిత్రీ బాయి పూలే జయంతి వేడుకలు

నవతెలంగాణ – జుక్కల్: మండలంలోని ప్రభూత్వ జూనియర్ కళాశాలలో మండల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 196వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా మండల ఎస్ఎఫ్ఐ అద్యక్షుడు షేక్ ఫిర్దోస్ మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే జీవితాన్ని గురించి విద్యార్థులకు వివరించారు. మండలంలో విద్యార్థులు మద్యలోనే అపేస్తున్నానారని , ఇది మంచి పరిణామం కాదని అన్నారు. కావున సావిత్రి బాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆనాడు ఆమె కూడా ఇంట్లో ఉండి ఉంటే మహిళలకు విద్య అందేది కాదని, పూలే ఆనాడు మహిళలకు అండగా ఉండి మహిళలకు బయటికి వచ్చే విధంగా సహకరించారని తెలిపారు. చదువుల తల్లిగా నిలిచిన సావిత్రి బాయి పూలే చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అద్యక్షులు, సబ్యులు కృష్ణ మోహన్, పండు, విద్యార్థిని, విద్యార్థులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

Spread the love