మహిళలకు సావిత్రీబాయి పూలే ఆదర్శం

నవతెలంగాణ-ప్రజ్ఞాపూర్‌
సావిత్రిబాయి పూలే జయంతిని సెయింట్‌ మేరీస్‌ విద్యానికేతన్‌ హై స్కూల్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం పాఠశాలలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ కాట రాయప్ప మాట్లాడుతూ బాలికల విద్య కోసం పోరాడి భారతదేశంలో విప్లవాన్ని తీసుకువచ్చిన మహిళ పూలే అని గుర్తు చేశారు. ప్రతి ఆడపిల్ల చదవడం, రాయడం, ప్రతి మహిళ తన కాళ్లపై తను నిలబడాలని ఆమె కలలు కన్నారన్నారు. అందుకోసం ఆమె తన భర్త జ్యోతిరావు పూలే తో కలిసి 1848లో పూణేలో భారత దేశంలోనే మొదటి మహిళా పాఠశాలను స్థాపించారన్నారు. కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
నవతెలంగాణ-తొగుట
సావిత్రీబారుపూలే జయంతిని టీచర్స్‌డేగా ప్రకటించాలని అంబేద్కర్‌ సమతా యూత్‌ అధ్యక్షులు కల్లెపు భాను చందర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో చదువుల తల్లి సావిత్రీబారు ఫూలే జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్‌ సమతా యూత్‌ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్‌ సమతా యూత్‌ ఉపాధ్యక్షులు వడ్డే నందు, కల్లేపు నరేష్‌, పులిగరి శివయ్య, చింటు, ప్రవీణ్‌, నాగరాజు, అంజి, చిన్నారులు ఉన్నారు.
నవతెలంగాణ-రాయపోల్‌
భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3 న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వ అధికారికంగా నిర్వహించాలని రాయపోల్‌ ప్రెస్‌ క్లబ్‌ మండల అధ్యక్షులు పుట్టా రాజు అన్నారు. బుధవారం రాయపోల్‌ మండల కేంద్రం అంబేద్కర్‌ చౌరస్తాలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో రాయపోల్‌ జర్నలిస్టులు మన్నే గణేష్‌,కనక స్వామి,కొంగరి శ్రీనివాస్‌,రాంసాగర్‌ ఉపసర్పంచ్‌ రాజిరెడ్డి, తెలంగాణ రజక సంఘం రాష్ట్ర నాయకులు పరశురాములు,దళిత బహుజన సంఘాల నాయకులు నవీన్‌, నాగరాజు, సాయికుమార్‌, భాను ప్రసాద్‌, నిఖిల్‌, రవి,సత్యనారాయణ గౌడ్‌, కనకయ్య, లింగం, లక్ష్మయ్య, వేణు, వంశీ, యాదయ్య, శివ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-మర్కుక్‌
అక్షరం అనే ఆయుధంతో సామాజిక ఆర్థిక రాజకీయ విప్లవానికి పునాది వేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలేనేనని ఎంపీపీ పాండు గౌడ్‌, జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం యాదవ్‌, ఎంఈఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరి అన్నారు. బుధవారం మండల పరిధిలోని చేబర్తి గ్రామంలో మహనీయుల ఉత్సవాల కమిటీ చైర్మన్‌ జాలని యాదగిరి ,కో కన్వీనర్‌ కనకరాజులతో కలిసి వారు చదువుల తల్లి సావిత్రి బాయి పూలే,మహాత్మా జ్యోతి రావు పూలే విగ్రహాలకు పూలమాల వేశారు. మహిళలు సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ స్వామి, వంటిటిమామిడి మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ రాందాస్‌ గౌడ్‌, రైతుబంధు సమితి అధ్యక్షులు జాలని బాల్‌ నర్సయ్య,చిన్ని కష్ణ,సారథి ఫౌండేషన్‌ చైర్మన్‌ శేఖర్‌ గుప్తా, ఉపాధ్యాయులు నర్సింలు, స్వాతి, యువజన సంఘాల నాయకులు కనకయ్య, భాస్కర్‌, అనిల్‌, రాజు, బాలకష్ణ, రాంబాబు, బాబు, పాఠశాల విద్యార్థులు తదితరులు ఉన్నారు.
నవతెలంగాణ-సిద్దిపేట
పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిలో బీడీఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డేవిడ్‌ ,ముర ళీకష్ణ లు మాట్లాడుతూ భారతదేశ తొలి పంతులమ్మ అని, స్త్రీ, పురుష లింగ వివక్షతను వ్యతిరేకించి, అణగారిన వర్గా ల విద్యాభివద్ధికి పాటుపడిన మహౌన్నతురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు. నాయ కులు డబ్బేట ఆనంద్‌, ప్రవీణ్‌, శివ, నాగార్జున పాల్గొన్నారు.
నవతెలంగాణ-బెజ్జంకి
కులమత భేదాలకతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి సావిత్రి బాయి ఫూలేనని బీఎస్పీ,స్వేరోస్‌, ప్రజా సంఘాల నాయకులు కొనియాడారు.బుధవారం మండలంలోని అయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు,ప్రజా సంఘాల అధ్వర్యంలో సావిత్రి బాయి ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని జ్యోతీరావ్‌ ఫూలే దంపతుల విగ్రహాల వద్ద బీఎస్పీ కరీంనగర్‌ జిల్లా కార్యవర్గ సభ్యుడు పెద్దొల్ల శ్రీనివాస్‌ యాదవ్‌,స్వేరోస్‌ నెట్‌ వర్క్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొర్ర సురేశ్‌ కుమార్‌,జిల్లా నాయకుడు ఉప్పులేటీ బాబు,ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రధానాచార్యులు హిమబింధు,కళాశాల సిబ్బంది,విద్యార్థులు జ్యోతీరావ్‌ ఫూలే,సావిత్రి బాయి ఫూలే విగ్రహలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కళాశాల మహిళ సిబ్బందిని స్వేరోస్‌ నాయకులు శాలువ కప్పి ఘనంగ సన్మానించారు.
నవతెలంగాణ-హుస్నాబాద్‌ రూరల్‌
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త, బాలిక విద్యకు బాటలు వేసిన సావిత్రీబాయి పూలేను బాలికలందరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని హుస్నాబాద్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఆకుల రజిత వెంకన్న అన్నారు. బుధవారం హుస్నాబాద్‌ పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే 193వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సింగిల్‌ విండో చైర్మన్‌ బొలిశెట్టి శివయ్య మాట్లాడుతూ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆదర్శ దంపతుల సేవలను కొనియాడారు. విద్యార్థులకు నోట్‌ బుక్స్‌, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్పర్సన్‌ ఐలేని అనిత రెడ్డి, కౌన్సిలర్లు దొడ్డి శ్రీనివాస్‌, చిత్తారి పద్మ వల్లపు రాజు ,మండల నోడల్‌ అధికారిణి బండారి మనీలా, బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్‌. వెంకటయ్య ,పూర్వ విద్యార్థులు ,నాయకులు మాజీ సర్పంచ్‌ కేడం లింగమూర్తి, చిత్తారి రవీందర్‌, మేకల వీరన్న యాదవ్‌, బత్తుల చంద్రమౌళి,ఎండీ హాసన్‌, గడిపె మల్లేశ్‌, గాదెపాక రవీందర్‌, వార్డెన్‌ వెంకటయ్య, గౌరిశెట్టి రాజు, బూట్ల రాజమల్లయ్య, కోశాధికారి పెరుమాండ్ల శ్రీనివాస్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి చిత్తారి శ్రీనివాస్‌,గుండోజు రాజేంద్ర ప్రసాద్‌, వెల్దండి శ్రీనివాస్‌,శామకూర తిరుపతి రెడ్డి, బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వెంకటరమణారెడ్డి ,వీరారెడ్డి, పంజా రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-సిద్దిపేట
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సింగిరెడ్డి నవీన మాట్లాడుతూ సావిత్రీబాయి పూలే భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా, మహిళా అభివద్ధి కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మి, అనిత , శిరీష, లక్ష్మి , తదితరులు పాల్గొన్నారు.

Spread the love