- 71% మంది బీమా చేయని భారతీయులు ‘ఆర్థిక రక్షణ ‘ కోసం ‘ బీమా ‘ ఒక కీలకం
- గత ఐదేళ్లలో దాదాపు సగం మంది (47%) బీమా చేయించుకున్న వ్యక్తులు తమ బీమా పాలసీని సరెండర్ చేశారు
అధ్యయనంలోని కీలక అంశాలు :
- వినియోగదారుల యొక్క ప్రధాన ఆందోళన వైద్య ఖర్చుల నుండి ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయంపైకి మారింది
- 80% మంది వినియోగదారులు బీమా అనేది ఆర్థిక భద్రతను సాధించడానికి కీలకమైన సాధనంగా భావిస్తున్నప్పటికీ, 94% మందికి బీమా లేదు లేదా తగినంతగా కవర్ చేయబడటం లేదు
- 37% మంది వినియోగదారులు ఫైనాన్సియల్ ఇమ్మ్యూనిటీ ని బహుళ ఆదాయ వనరులతో సమంచేస్తారు.
- 41% మంది ‘ద్వితీయ ఆదాయం’ కలిగి ఉండటం ఆర్థిక రక్షణ ని బలోపేతం చేయగలదని పేర్కొన్నారు
- 52% భారతీయ కుటుంబాలు పొదుపు, పెట్టుబడులు, జీవిత బీమా మరియు ఆరోగ్య బీమా పథకాలలో నిధులను పెట్టుబడి పెట్టడం ద్వారా ఆర్థిక రక్షణ శక్తిని పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నాయి.
- 80% వినియోగదారులు పూర్తిగా యజమాని అందించిన బీమా పాలసీలపై ఆధారపడుతున్నారు
దేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రయివేట్ జీవిత బీమా సంస్ధలలో ఒకటైన SBI లైఫ్ ఇన్సూరెన్స్, తమ సమగ్ర వినియోగదారు అధ్యయనం యొక్క మూడవ ఎడిషన్ – ‘ఫైనాన్షియల్ ఇమ్యూనిటీ స్టడీ (F.I.) 3.0’ ను “వినియోగదారుల భ్రమలను తొలగించడం” పేరుతో ఆవిష్కరించింది. ఈ అధ్యయనం భారతీయ వినియోగదారుల మనస్సులను లోతుగా పరిశోధిస్తుంది, ఆర్థిక సంసిద్ధత చుట్టూ ఉన్న అపోహలను విప్పుతుంది మరియు నిజమైన ఆర్థిక భద్రతకు వారి మార్గాన్ని అడ్డుకునే సాధారణ భ్రమలను వెల్లడిస్తుంది. SBI లైఫ్ నాలెడ్జ్ భాగస్వామి- డెలాయిట్ సహకారంతో ఈ అధ్యయనాన్ని ప్రారంభించింది. భారతదేశం యొక్క నలుమూలలా కవర్ చేస్తూ 41 నగరాల్లోని 5,000 మంది స్పందన దారులను చేరుకుంది. ఊహించని సవాళ్లతో ప్రపంచాన్ని పునర్నిర్మించిన నేపథ్యంలో, ఆర్థిక సంసిద్ధత గురించి భారతీయ వినియోగదారు యొక్క అవగాహన తరచుగా భ్రమలతో కప్పబడి ఉంటుంది. ఇది జీవిత అనిశ్చితి మధ్య తమకు లేదా తమ కుటుంబ సభ్యులకు తగినంతగా ఆర్థిక రక్షణను అందించలేని భయంకరమైన పరిణామాలను కలిగిస్తుంది. 68% మంది వినియోగదారులు తాము తగినంతగా బీమా చేయబడ్డామని విశ్వసిస్తుండగా, కేవలం 6% మంది మాత్రమే వాస్తవంగా తగినంత గా బీమా కవరేజీ కలిగి వున్నారు.
అయినప్పటికీ, ఆశాజనకమైన 71% మంది బీమా లేని స్పందన దారులు ‘ఆర్థిక రక్షణ ‘ సాధించడానికి భీమా ఒక సంపూర్ణ అవసరం అని నమ్ముతున్నందున, ఆశ పడటానికి ఇంకా ఒక కారణం ఉంది. అదనంగా, బీమా చేయబడిన 83% మంది వ్యక్తులు ఆర్థిక స్థిరత్వంను సాధించడంలో బీమా యొక్క క్లిష్టమైన స్వభావాన్ని గుర్తిస్తున్నారు, SBI లైఫ్ యొక్క ఫైనాన్షియల్ ఇమ్యూనిటీ స్టడీ 3.0 దీనిని వెల్లడిస్తుంది. ఫైనాన్షియల్ ఇమ్యూనిటీ భావనను ప్రజల్లోకి తీసుకువెళ్తూ , SBI లైఫ్ ఇప్పుడు ఉచితంగా వినియోగించతగిన వీలున్న ‘ఫైనాన్షియల్ ఇమ్యూనిటీ కాలిక్యులేటర్’ని సైతం కూడా విడుదల చేసింది. ఇది వినియోగదారుల ప్రొఫైల్‌లు, ప్రస్తుత ఆర్థిక ఆస్తులను ఒడిసి పట్టి వ్యక్తిగతీకరించిన తమ ఫైనాన్సియల్ ఇమ్మ్యూనిటి స్కోర్ ను తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ రోజు సిద్ధం కావడం రేపటికి పునాదిని పటిష్టం చేస్తుందని ఈ స్కోర్ గుర్తు చేస్తుంది. ‘ఫైనాన్షియల్ ఇమ్యూనిటీ కాలిక్యులేటర్’ వ్యక్తులు తమ ఆర్థిక సంసిద్ధతలో గుర్తించిన అంతరాలను ఎలా అధిగమించవచ్చనే దానిపై విలువైన సూచనలను కూడా అందిస్తుంది.