‘జేథాట్’ను ఆవిష్కరించిన ఎస్‌బీఐ సెక్యూరిటీస్

నవతెలంగాణ ముంబై: ఆర్థిక సేవల్లో నమ్మకమై సంస్థగా పేరొందిన ఎస్‌బీఐ సెక్యూరిటీస్, విశ్వాసంతో పెట్టుబడి పెట్టడం గురించి చెప్పే తన తొలి బ్రాండ్ చిత్రాన్ని ఆవిష్కరించింది. ఈ చిత్రం, ఆర్థిక సాధికారత స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది, అలాగే యుద్ధ నినాదం అయిన ‘‘జే థాట్’’ను, అంటే ‘‘ఇది నా గర్వాకారణమైన క్షణం’’ అని ప్రతి ధ్వనిస్తుంది. పెట్టుబడులు సరైన విధంగా సాగితే, కలలు సాకారం అవుతాయి అనే విషయాన్ని చాటిచెబుతుంది. ఈ ఆకట్టుకునే చిత్రం, ఎస్‌బీఐ సెక్యూరిటీస్ ద్వారా రీసెర్చ్ దన్నుతో, అలాగే బ్రాండ్‌పై తమకున్న అచంచలమైన నమ్మకంతో వ్యక్తులు అన్నీ తెలుసుకొని, సరైన నిర్ణయాలు తీసుకోవడాన్ని చూపిస్తుంది.
విశ్వాసంతో పెట్టుబడి పెట్టడం అనేది విబిన్న వినియోగదారుల నేపథ్యాల మధ్య పంచుకునే సెంటిమెంట్‌ అనే ఆలోచనను కళాత్మకంగా తెలియజేస్తుంది. ప్రతి భారతీయ ఇన్వెస్టర్ యొక్క పెట్టుబడి ప్రయాణంలో ఎస్‌బీఐ సెక్యూరిటీస్ పోషిస్తున్న స్థిరమైన భాగస్వామి పాత్రను ఇది సూచిస్తుంది. విశ్వాసంతో కూడిన ఇన్వెస్టర్ల కథనాలను చూపించే ఒక బలమైన ప్రచారం ద్వారా మరింత మంది ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు బ్రాండ్ సిద్ధంగా ఉంది. ‘‘నాలుగు విభిన్న జీవిత అనుభవాల ద్వారా కథనాన్ని అందించే చిత్రాన్ని అందిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము అలాగే గౌరవంగా భావిస్తున్నాము, విశ్వాసంతో పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్లకు ఒక నమ్మకమైన భాగస్వామి అవసరం అనే ఒకే విధమైన ఆలోచనలను వీళ్లందరూ కలిగి ఉంటారు.
ఆర్థిక సేవలకు సంబంధించి భారతదేశంలోనే అత్యంత నమ్మకమైన ఇంకా ప్రియమైన బ్రాండ్‌లలో ఒకటిగా నిలుస్తున్న, అత్యున్నతమైన ఎస్‌బీఐ గ్రూప్‌లో భాగంగా ఉన్న మేము మా కస్టమర్లకు ఇస్తున్న స్పష్టమైన సందేశం ఏమిటంటే, ఎస్‌బీఐ సెక్యూరిటీస్ ఎల్లప్పుడూ మీకు తోడుగా, మీ వెంటే ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి అవసరమైన ఆర్థికపరమైన విశ్వాసాన్ని మీలో నింపుతుంది. వినియోగదారులతో మాకు ఉన్న అనుబంధం లావాదేవీలకే పరిమితం కాదు, అంతకు మించినది; ఇది జీవితకాల నమ్మకంపై నిలిచి ఉంది, ఈ సందేశం మా చిత్రంలో అంతర్లీనంగా ఉంటుంది’’ అని ఎస్‌బీఐ సెక్యూరిటీస్ ఎండీ & సీఈఓ దీపక్ కుమార్ లల్లా పేర్కొన్నారు.

Spread the love