మద్యం మత్తులో వాహనం నడిపితే కేసు నమోదు : ఎస్సై శ్రీనివాస్ రెడ్డి

నవతెలంగాణ బొమ్మలరామరం: నూతన సంవత్సర వేడుకలను అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అనంతరం నవతెలంగాణతో మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మండల ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే పోలీసులకు సమాచారం అందజేయాలని కోరారు.

Spread the love