ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం చేయాలి

నవతెలంగాణ-మిరుదొడ్డి
దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం చేయాలని దళిత బహుజన ఫ్రంట్‌ వ్వవస్ధాపక అధ్యక్షుడు కొరివి వినరు కుమార్‌, డిబిఎఫ్‌ జాతీయ కార్యదర్శి పి.శంకర్‌ డిమాండ్‌ చేశారు. దేశ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఢిల్లీలో దళిత్‌ మార్చ్‌ టూ పార్లమెంటు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సామాజిక న్యాయ సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. భారత రాజ్యాంగ స్థానంలో మను అధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తున్న బిజెపి విధానాలను మానుకోవాలన్నారు. రాజ్యాంగ బద్దంగా దళితులు సాధించుకున్న ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, రిజర్వేషన్లను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు దౌర్జన్యాలు పెరిగాయన్నారు. భూ సంస్కరణలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎఎడబ్ల్యు జాతీయ నాయకులు మట్టగల్ల వెంకటయ్య,డిబిఎఫ్‌ రాష్య కార్యదర్శి పులి కల్పన,టివివియు నాయకులు నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love