స్కాన్ చేయండి.. చరిత్ర తెలుసుకోండి

Scan.. Know the historyనవతెలంగాణ – హైదరాబాద్: చారిత్రక కట్టడాల వివరాలు ప్రజలకు తెలిసేలా కేంద్ర పురావస్తుశాఖ ఆయా నిర్మాణాల వద్ద క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేస్తోంది. వరంగల్(D) ఖిలా వరంగల్‌లోనూ వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఈ కోడ్‌ను ఫోన్‌లో స్కాన్ చేస్తే తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో కాకతీయుల చరిత్ర, ఆలయాల విశేషాలు, పురాతన కట్టడాల గురించి చూపిస్తుంది. జిల్లాల పర్యాటక ప్రాంతాల వివరాలు, గూగుల్ మ్యాప్ లొకేషన్ వంటివి తెలుసుకునే వెసులుబాటు కల్పించింది.

Spread the love