నవతెలంగాణ – కమ్మర్ పల్లి
స్కూల్ బస్సులకు అనుభవజ్ఞులనే డ్రైవర్లుగా పెట్టుకోవాలని ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి అన్నారు. శనివారంమండల కేంద్రంలోణి ఉషా జ్యోతి ఉన్నత పాఠశాలలో శనివారం ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ బస్సులు నడిపించే డ్రైవర్లకు, హెల్పర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎంవిఐ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ స్కూల్ బస్సులకు అనుభవం ఉన్న వారినే డ్రైవర్లుగా పెట్టుకోవాలన్నారు. చిన్నపిల్లలను ఉంటారు కాబట్టి డ్రైవర్లు కూడా బస్సులను జాగ్రత్తగా నడపాలి అన్నారు. బస్సు నడుపుతూ సెల్ ఫోన్ లో మాట్లాడకూడదని, ఇండికేటర్లు, లైట్లు సరిగా పనిచేస్తున్న లేవా అని చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ చట్టం పై అవగాహన కల్పించారు.అంతకుముందు ఆయన ప్రైవేట్ స్కూల్ బస్సుల ఫిట్నెస్ ను పరీక్షించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యులు, తదితరులు పాల్గొన్నారు.