నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
పట్టణంలోని ఎస్‌ఆర్ ప్రైమ్ పాఠశాలలో క్యాబినెట్ ఎన్నికలు నిర్వహించారు. మంగళవారం హెడ్ బారు, డిప్యూటి హెడ్ బారు కోసం ఎన్నికలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సహంగా ఎన్నికల్లో పాల్గొని వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ ఎన్నికలను తలపించేలా వాతావరణాన్ని పాఠశాల యాజమన్యం కల్పించింది. విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నికలను నిర్వహించడం జరిగిందని జోనల్ ఇన్‌చార్జి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పాఠశాలలోని విద్యార్థులు ఎంతో ఉత్సహంగా పోటీలో పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కిరణ్ కుమార్, శ్రీకర్ రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, హరీశ్, అన్వేష్‌రెడ్డి, హర్పాల్ సింగ్, రాఖీ, సుమయ పాల్గొన్నారు.