అంగన్ వాడి కేంద్రాల్లో బడిబాట..

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఆన్ సాన్ పల్లి గ్రామంలో అంగన్ వాడి  కేంద్రాల్లో మంగళవారం అంగన్ వాడి సూపర్ వైజర్ సరస్వతి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్నీ నిర్వహించారు. రెండున్నర సంవత్సరాలు దాటిన చిన్నారులను అంగన్ వాడి కేంద్రాల్లో చేర్పించాలని చిన్న  పిల్లల తల్లులకు అవగాహన కల్పించారు.చిన్నారులను అంగన్ వాడి కేంద్రాల్లో చేర్పించడం ద్వారా పాలు,గుడ్లు,పప్పులు,నూనెలు,బాలామృతం తదితర పోషకారాలు లభించే ఆహారపదార్థాలు ప్రభుత్వం ద్వారా అంధించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్లు ప్రమీల, రమా, అనూష, ఆయాలు,చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.
Spread the love