పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలి..

నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని ప్రభుత్వ నియమాల ప్రకారం లేనటువంటి ప్రైవేటు విద్యాసంస్థలని వాటి యొక్క గుర్తింపును రద్దు చేయాలని తెలంగాణ నవ నిర్మన్ విద్యార్థి డివిజన్ ఇన్చార్జి సాయి కిషోర్ స్థానిక మండల విద్యాశాఖ అధికారి రాజా గంగారాం కు వినతి పత్రాన్ని అందించారు .ఏ విద్యా సంస్థకి సరియైన ఆటస్థలం లేనట్టయితే మరియు స్కూల్ లు కమర్షియల్ కాంప్లెక్స్ లో నడుపుతున్నారో అనుమతులు లేకుండా కొన్ని విద్యాసంస్థలు అక్రమంగా పాఠశాలల్లో పుస్తకాలు అమ్ముతున్నారో అటువంటి పాఠశాలలపై మండల విద్యాశాఖ అధికారి తక్షణమే వాటికున్న గుర్తింపును రద్దుచేయ్యాలని విద్య హక్కు చట్టాన్నిఅమలుచేసి కార్పొరేట్ స్కూళ్ళలో ఫీజుల నియంత్రణ అమలు చేయాలని ఆయన అన్నారు లేనిపక్షంలో జిల్లా స్థాయి లో అన్ని కార్పొరేట్ పరసలలపై ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మురళి తేజ తిరుపతి తదితరులు పాల్గొన్నారు..

Spread the love