ఏపీలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

నవతెలంగాణ-హైదరాబాద్ : వేసవి సెలవుల అనంతరం ఏపీలో నేడు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇక విద్యార్థులు, ఉపాధ్యాయులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. ప్రతి ఏటా జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. కానీ ఈ ఏడాది నూతన ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో అదనంగా ఓ రోజు సెలవు వచ్చింది. బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొదటి రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ గతంలో చెప్పారు. ఈ క్రమంలో నేటి నుంచే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, కిట్లు పంపిణీ చేయనున్నారు. యూనిఫారంతో పాటు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, విద్యా కానుకను పూర్తిస్థాయిలో అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Spread the love