కేరళ టాలెంట్ స్కూల్లో ఘనంగా సైన్స్ దినోత్సవం

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల కేరళ టాలెంట్ స్కూల్ లో బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులను పాఠశాల ఆవరణలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రాజదాస్ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎంపీపీ రాజుదాస్ మెడల్ తో పాటు సర్టిఫికెట్ ప్రధానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నిర్మల జిమ్మీ. కాంగ్రెస్ నాయకులు ధనుంజయ్ పాల్గొన్నారు.

Spread the love