లైబ్రరియన్‌ అభ్యర్థులకు 31న ధ్రువపత్రాల పరిశీలన

– టీజీపీఎస్సీ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ఇంటర్‌ విద్య, సాంకేతిక విద్యలో లైబ్రరియన్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 31న హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కార్యాలయంలో రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చేనెల రెండున రిజర్వ్‌ డేగా ఉంటుందని వివరించారు. టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ అందుబాటులో ఉందని తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు అవసరమైన అన్ని పత్రాలనూ తీసుకురావాలని సూచించారు. ఎవరైనా అభ్యర్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలను తీసుకురాకపోతే ఆ తర్వాత అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. ధ్రువపత్రాల పరిశీలనకు గైర్హాజరైతే తర్వాత ఈ ప్రక్రియను చేపట్ట బోమని స్పష్టం చేశారు. శుక్రవారం నుంచి వచ్చేనెల రెండు వరకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశముందని తెలిపారు. విద్యాశాఖ పరిధిలో ఇంటర్‌ కమిషనరేట్‌లో 40, సాంకేతిక విద్యాశాఖలో 31 కలిపి మొత్తం 71 లైబ్రెరియన్‌ పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్‌ 31న నోటిఫికేషన్‌ను విడుదల సంగతి తెలిసిందే. ఇతర వివరాలకు అభ్యర్థులు షషష.్‌రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.

Spread the love