గురువారం వరకు ఎస్సెస్సీ పరీక్షా ఫీజు గడువు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎస్సెస్సీ వార్షిక పరీక్షల ఫీజుల చెల్లింపునకు డిసెంబర్‌ 7 వరకు అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఫీజులను సంబంధిత హెడ్‌ మాస్టర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. రూ.50 అపరాధ రుసుంతో డిసెంబర్‌ 14 నాటికి, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబర్‌ 12 నాటికి, రూ.500తో జనవరి 3 నాటికి ఫీజులను చెల్లించవచ్చు.

Spread the love