నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచ స్థాయిలో క్రికెట్‌తో తమ దీర్ఘకాల అనుబంధాన్ని బలోపేతం చేసుకుంటూ, సీగ్రమ్ రాయల్ స్టాగ్ ఒక వినూత్నమైన మరియు లీనమయ్యే AI- ఆధారిత అభిమానుల అనుభవాన్ని ‘ ఏ బిలియన్ ఫిల్మ్స్ ఫర్ ఏ బిలియన్ ఫ్యాన్స్’ (నూరు కోట్ల అభిమానుల కోసం నూరు కోట్ల సినిమాలు) విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. భారతదేశం యొక్క అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్లలో ముగ్గురు, జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా మరియు సూర్య కుమార్ యాదవ్ ఈ చిత్రం లో కనిపించనున్నారు. క్రికెట్‌తో ముడిపడి ఉన్న, జీవితానికంటే మిన్న అయిన భావోద్వేగాలను మరింతగా పెంపొందిస్తూ , బ్రాండ్ కొత్త తరం యువ క్రికెట్ అభిమానులను ఆకట్టుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది, ఈ అభిమానులలో అధిక శాతం మంది పెద్దలుగా భారతదేశంలో తమ మొదటి ప్రపంచ కప్‌ను చూస్తున్నారు. ఈ ప్రపంచ కప్ భారతదేశంలో జరుగుతోంది మరియు ఇది ఇప్పటికే “గ్రేటెస్ట్ వరల్డ్ కప్” గా పేర్కొనబడుతుంది. బ్రాండ్ యొక్క ‘లివ్ ఇట్ లార్జ్’ ఫిలాసఫీతో సమకాలీకరించడం తో, AI-ఇంటిగ్రేటెడ్ ప్రచారం ప్రతి అభిమాని , ఈ క్రికెటర్లతో కూడిన వ్యక్తిగతీకరించిన చిత్రంలో భాగం అయ్యే అవకాశాన్ని అందిస్తుంది. క్రియేటివ్ ఏజెన్సీ భాగస్వాములైన FCB ఇండియా, డిజిటల్ ఏజెన్సీ భాగస్వాములైన డెన్సు ఇండియా, టెక్నాలజీ పార్టనర్ ఆర్టిజెన్‌ల ఈవెంట్స్ మరియు అనుభవపూర్వక పరిష్కారాలు & మీడియా భాగస్వాములైన వేవ్‌మేకర్‌తో భాగస్వామ్యం చేసుకుని ఈ ప్రచారం రూపొందించబడింది; ఈ ప్రచారం సంచలనాత్మకమైనది. ఇక్కడ ప్రతి అభిమాని తమ కలను మాత్రమే కనడం కాకుండా, పెద్దగా జీవించగలుగుతారు.