మైనర్ బాలికపై లైంగికదాడి పాల్పడ్డ నిందితుల కోసం 7బృందాలతో గాలింపు..

నవతెలంగాణ – మీర్ పేట్
మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితులను నిందితుల సీనియర్ పోలీస్ అధికారులతో 7ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామని తొందరలోనే నిందితులను పట్టుకుంటామని ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ అన్నారు. మైనర్ బాలికను (16)  వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని ఆ బాలిక ఆరోగ్యంగా ఉందని తెలిపారు. మంగళవారం మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సాయిశ్రీ మాట్లాడుతూ.. మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని అన్నారు. సోమవారం ఉదయం బాలికపై లైంగికదాడి ఘటనలో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. విచారణలో బాలిక ముగ్గురు పేర్లు చెప్పడంతో ఆ ముగ్గురుపై కేసు నమోదు చేశాము. నిందితులను పట్టుకునేందుకు సీనియర్ పోలీస్ అధికారులతో ఏడు ప్రత్యేక బృందాలతో అన్ని కోణాల్లో దర్యాప్తు, అన్ని వైపులా గాలింపు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయిపై ఉక్కు పాదం మోపుతామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే గంజాయిపై ఉక్కుపాదం మోపడంలో రాచకొండ కమిషనరేట్ మొదటి స్థానంలో ఉంది. విచారణలో బాలిక ముగ్గురు నిందితులు ఉన్నట్లు తెలిపిందని. 8 మంది ఉన్నారనేది ఆరోపణలు మాత్రమే అని అన్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఆమె అన్నారు. బాధితురాలుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటమన్నారు.
Spread the love