నవతెలంగాణ-గోవిందరావుపేట
తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తున్న సెకండ్ ఏఎన్ఎంల సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంఘం జిల్లా అధ్యక్షురాలు పాయం సరోజన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని మరియు వసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని ప్రధాన వైద్యాధికారులకు సంఘం ఆధ్వర్యంలో సెకండ్ ఏఎన్ఎంలు వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సరోజన మాట్లాడుతూఏఐటీయూసీ ఆధ్వర్యంలో సెకండ్ ఇయర్ యూనియన్ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా బిహెచ్ సమస్యల పరిష్కారానికి వేసిన త్రీ మెన్ కమిటీ ద్వారా సమస్యలు త్వరగా పరిష్కరించాలని పీహెచ్ సి లలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్స్ కి వినతి పత్రాలు అందించడం జరిగినదన్నారు. ములుగు జిల్లా పసర పిహెచ్ సి తోపాటు జిల్లాలోని 15 పి హెచ్ సి లలో వినతి పత్రాలు అందించడం జరిగింది కనుక ప్రభుత్వం కాలయాపన చేయకుండా అతి త్వరలో రెగ్యులరేషన్ విషయంపై గ్రాస్ సాలరీ విషయంపై మిగతా విషయాలపై పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగినది త్వరగా ఈ పరిష్కారం కానీ యెడల మరొకసారి సమ్మెకు వెళ్లవలసి వస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు సుజాత, సరోజిని, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.