భద్రాచలంలో రెండో హెచ్చరిక జారీ

నవతెలంగాణ-హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కు తున్నది. బుధవారం మధ్యాహ్నం 43 అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 9.45 గంటలకు 48 అడుగులకు ప్రవాహం పెరుగ డంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీరాంసాగర్‌కు వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు గేట్లు ఏ క్షణమైనా ఎత్తే అవకాశం ఉన్నది. ప్రాణహితలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది.కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్‌లో ఎగువన ఉన్న ప్రాజెక్టులకు స్థిరంగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు సైతం స్వల్పంగా వరద వస్తున్నది. మూసీ ఏడు గేట్లను ఎత్తారు.

Spread the love