యజమాని బెడ్‌రూంలో సీక్రెట్‌ కెమెరా..ప్రయివేటు వీడియోలతో

నవతెలంగాణ-హైదరాబాద్ : గురుగ్రాంలో షాకింగ్ ఘటన జరిగింది. పనిమనిషి తనకు తెలియకుండా బెడ్‌రూంలో సీక్రెట్ కెమెరా పెట్టాడని ఓ మహిళ ఆరోపించింది. ఆపై తన ప్రయివేటు వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించి రూ.2లక్షలు డిమాండ్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయంపై వారు విచారణ చేపట్టారు. యజమాని చెప్పిన వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం ఓ ప్లేస్‌మెంట్ ఏజెన్సీ ద్వారా ఈమె పనిమనిషిని నియమించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అతడు బెడ్‌రూంలో స్పై కెమెరా ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత ఆమె ప్రయివేటు వీడియోలను సేకరించాడు. అయితే గతవారం ఇల్లు శుభ్రం చేసే సమయంలో యజమానికి సీక్రెట్ కెమెరా కన్పించింది. దీంతో వెంటనే పనిమనిషిని పనిలోనుంచి తీసేసింది. ఈ విషయం ఎవరికీ తెలియవద్దనే భయంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. అయితే పనిమనిషి డబ్బుకోసం యజమానిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. రూ.2 లక్షలు ఇవ్వకపోతే ఆమె ప్రయివేటు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. దీంతో గత్యంతరం లేక ఆమె ఫోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు కేసు నమోదు చేసుకుని నిందితుడు శుభం కుమార్‌ను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు.

Spread the love