సికింద్రాబాద్‌-విశాఖ వందేభారత్‌ రైలు 5 గంటలు ఆలస్యం

నవతెలంగాణ – హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (20834) ఐదు గంటల ఆలస్యంగా బయల్దేరనుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరాల్సిన ఈ రైలును రాత్రి 8 గంటలకు రీషెడ్యూల్‌ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. రైలు దాదాపు ఐదు గంటల పాటు ఆలస్యం కావడంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేక పలువురు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Spread the love