నవతెలంగాణ – హైదరాబాద్ : నేడు సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళాల్సిన వందే భారత్ రైలు సాంకేతిక లోపాలతో రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా 08134ఏ అనే నంబర్ గల మరో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇది వందే భారత్ షెడ్యూలు ప్రకారమే నడుస్తుందని, సికింద్రాబాద్ నుండి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి, రాత్రి 11: 30 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుందని వారు తెలిపారు.