భ‌ద్ర‌త క‌ట్టు‌దిట్టం

– కౌంటింగ్‌ కేంద్రం వద్ద పటిష్టమైన నిఘా
– ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
– ఎస్పీ డాక్టర్‌ వినీత్‌
నవతెలంగాణ-కొత్తగూడెం
అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా కౌంటింగ్‌ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు, ఆదివారం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎస్పీ డాక్టర్‌ వినీత్‌.జి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేశామన్నారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదన్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రమైన పాల్వంచ అనుబోస్‌ కళాశాల పరిసర ప్రాంతాలను డాగ్స్‌ స్క్వాడ్‌, బాంబు స్క్వాడ్‌తో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అభ్యర్థులు, ఏజెంట్లు లెక్కింపునకు హాజరు అయ్యే అధికారులు నిషేధిత వస్తువుల అయిన అగ్గిపెట్టెలు, లైటర్‌, ఇంక్‌ బాటల్స్‌, పేలుడుకు కారణమయ్యే ఎలాంటి వస్తువులను లెక్కింపు కేంద్రాల్లోకి తీసుకురాకూడదని తెలిపారు. తనిఖీలు చేసే పోలీసు సిబ్బందికి సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Spread the love