అ భూమి కబ్జా కాకుండా చూడండి..

– తహసిల్దార్ కు ఎమ్మెల్యే ఆదేశాలు
నవతెలంగాణ – డిచ్ పల్లి
భూమి కబ్జా కాకుండా చూడాలని తహసిల్దార్ కు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాలను జారీ చేసినట్లు బిఅర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు శక్కరి కోండ కృష్ణ, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని గన్ పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను మర్యాద పూర్వకంగా కలిసి సమస్యలతో కుడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఘన్పూర్ గ్రామ శివారులో గల 349 సర్వే నంబర్లో గల భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని, అ భూమి కబ్జా కాకుండా, ఆ భూమిని ఘన్పూర్ గ్రామానికి చెందే విధంగా చేసి ఇవ్వాలని వారు విన్నవించారు. అ భూమిని ఘనపూర్ గ్రామ ప్రజల అవసరాల కోసం వాడుకోవడం కోసం చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు.వేంటనే స్పందించిన ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సానుకూలంగా స్పందించి తహసిల్దార్ శ్రీనివాస్ రావు కు భూమి కబ్జా కాకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సినియర్ నాయకులు రామకృష్ణ, సొసైటీ డైరెక్టర్ సతీష్ రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పెద్దపులి భూమయ్య, సాకలి చిన్న గంగారం, మహేష్, నర్సయ్య, దేవయ్య, గంగారం, దశరథ్ , తిరుపతి, కుమ్మరి కిషన్ రైతులు ఉన్నారు.

Spread the love