పథకాలు ప్రజలకు అందేలా చూస్తా

– గజ్వేల్‌ కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి
నవతెలంగాణ- గజ్వేల్‌
తెలంగాణలో మొదటిసారిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి సూచించిన ప్రభుత్వ పథకాలను గజ్వేల్‌ నియోజకవర్గం ప్రజలకు అందేలా చూస్తానని గజ్వేల్‌ కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ప్రభుత్వ మాత్రం కాంగ్రెస్‌ ఉన్నందున పూర్తిస్థాయిలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి అందేలా ఆరు గ్యారంటీలు ప్రజలకు వినియోగమ య్యేలా చూస్తానని తెలిపారు. ఈ నెల 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా పూర్తిస్థాయిలో ప్రభుత్వం పథకాలను అమలుకు ఆదేశిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలకు రానున్న రోజుల్లో పెద్దపీట వేస్తామ న్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటా అన్నారు.

Spread the love