రైతులకు అందుబాటులో విత్తనాలు

నవతెలంగాణ-వీణవంక
రాష్ట్ర ప్రభుత్వం వానకాలం సాగు కోసం విత్తనాభివృద్ధి సంస్థ తెలంగాణ సీడ్స్ ఆధ్వర్యంలో రైతులకోసం విత్తనాలను అందుబాటులో ఉంచిందని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని రెడ్డిపల్లి క్లస్టర్ ఏఈవో రాకేష్, టీఎస్ సీడ్స్ సూపర్ వైజర్ సాధన సూచించారు. మండలంలోని ఘన్ముక్ల గ్రామంలో రైతులకు విత్తనాల సాగుపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు సాగు కోసం ప్రభుత్వ ఆమోదం పొందిన విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని, ధృవీకరణ లేని వాటిని కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. తెలంగాణ సీడ్ విత్తనాలైన కేఎన్ఎం118, ఎంటీయూ 1010, బీపీటీ5204, కేఎన్ఎం1638, ఎన్ఎల్ఆర్ బీ 34449 తదితర రకాలు వీణవంక, చల్లూరు దుకాణాల్లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు కాంతాల రాజిరెడ్డి, గుడిపాటి శివారెడ్డి, నాగిడి రాంరెడ్డి, ఉపేందర్, జున్నుతుల సుధాకర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Spread the love