సీతాకళ్యాణ వైభోగమే రిలీజ్‌కి రెడీ

సీతాకళ్యాణ వైభోగమే రిలీజ్‌కి రెడీసుమన్‌ తేజ్‌, గరిమా చౌహాన్‌ హీరో, హీరోయిన్లుగా డ్రీమ్‌ గేట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సతీష్‌ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్‌ నిర్మించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ సినిమాను ఈనెల 21న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను ‘బలగం’ నిర్మాత హర్షిత్‌ రెడ్డి విడుదల చేశారు. సోమవారం నిర్వహించిన ఈ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో దర్శకుడు సతీష్‌ పరమవేద మాట్లాడుతూ, ‘మా సినిమా పాటలు టీ-సీరిస్‌ ద్వారా రిలీజ్‌ అయ్యాయి. మా ట్రైలర్‌ అందరికీ నచ్చింది. హర్షిత్‌ రెడ్డి కజిన్‌ సుమన్‌ తేజ్‌ హీరోగా పరిచయం కాబోతున్నారు. చరణ్‌ అర్జున్‌ మంచి పాటలు ఇచ్చారు. నిర్మాత యుగంధర్‌కి సినిమా మీద ఎంతో ప్యాషన్‌ ఉంది. కుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమాను తీశాను. నీరూస్‌ సంస్థ వల్లే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది’ అని తెలిపారు.

Spread the love