
– జాతర లో ఫుడ్ పాయిజన్ కాకుండా చూడాలి
– హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా
– అత్యధికంగా 40 బైక్ అంబులెన్స్ ఏర్పాటు
– హెల్త్ డైరెక్టర్ ఆర్ వి కర్ణన్
నవతెలంగాణ – తాడ్వాయి
ఆశ ఖండంలో అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతర తెలంగాణ కుంభమేళా అయినటువంటి మేడారం మహా జాతరలో విస్తృతంగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క అన్నారు. శనివారం మేడారం హరిత హోటల్ లో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, హెల్త్ డైరెక్టర్ ఆర్ వి కర్ణన్ ములుగు జిల్లా ప్రత్యేక అధికారి అప్పయ్య లతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. మేడారం జాతరలో భక్తులకు విస్తృత వైద్య సేవలు అందించాలని భక్తుల రద్దీ పెరుగుతున్నా దృష్ట్యా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని అన్నారు. వైద్యులు దేవుడి తో సమానం అని అమ్మ జన్మిస్తే వైద్యులు పునర్జన్మ ఇస్తారని జాతర లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని వైద్య సదుపాయాలు, మందులు అందుబాటులో ఉండాలని అన్నారు. హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ క్రిస్టినా మాట్లాడుతూ జాతర లో ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ కాకుండా చూడాలని ఫుడ్ సేఫ్టీ అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందని, జాతరలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులు భక్తులకు తెలిసే విధంగా సైన్ బోర్డ్ లు ఏర్పాటు చేయాలని అన్నారు. గద్దెల ప్రాంగణం లో తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపం లో 24/7 వైద్య సేవలు అందించాలని మెడిసిన్ కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. హెల్త్ డైరెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ 40 జి వి కే అంబులెన్సు సేవలు భక్తులకు నిరంతరం అందుబాటులో ఉంటాయని తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో నిరంతరం వైద్య సిబ్బంది ఉండే విధంగా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లో గజ ఈతగాళ్లు ఉండేలా చూడాలని ఎండలు తీవ్రంగా ఉన్నా నేపథ్యం లో క్యూ లైన్ లో ఉండే భక్తులకు ఓ ఆర్ ఎస్ పాకెట్స్ అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్, జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ , జిల్లా వైద్య అధికారి డాక్టర్ అలేం అప్పయ్య, సామాజిక ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ జగదీష్ , ఏటూరు నాగారం ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ సురేష్ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.