నిమ్స్ లో విద్యార్థి కార్తీక్ ను పరామర్శించిన సీతక్క

నవతెలంగాణ-హైదరాబాద్ : నిమ్స్ లో చికిత్స పొందుతున్న ములుగు మండలం బండారుపల్లి గురుకుల పాఠశాల విద్యార్థి కార్తీక్ ను మంత్రి సీతక్క పరామర్శించారు. కార్తీక్ కు అందుతున్న వైద్యం గురించి అక్కడి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అధైర్యపడవద్దని కార్తీక్ కుటుంబ సభ్యులకు మంత్రి ధైర్యం చెప్పారు. కాగా, ఈ నెల 2వ తేదీన బండారుపల్లి టీజీ గురుకుల పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు కార్తీక్, ప్రణయ్ అస్వస్థతకు గురయ్యారు. అయితే విద్యార్థులు విష పురుగుల కాటుకు గరయ్యారని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు వారిని వెంటనే ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేశారు. ప్రణయ్ ఆరోగ్యం మెరుగుపడగా కార్తీక్ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో హైదరాబాద్ నిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Spread the love