అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్ల పట్టివేత

నవతెలంగాణ-ఆదిలాబాద్‌ టౌన్‌
మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న మధ్యం బాటిళ్లను పట్టుకున్నట్లు ఆదిలాబాద్‌ ఎక్సైజ్‌ సీఐ విజేందర్‌ తెలిపారు. ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ స్టేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులలో జైనథ్‌ మండలం గిమ్మ గ్రామానికి చెందిన మాదాసు సాయి వద్ద 2 లీటర్ల 6 మహారాష్ట్ర మధ్యం బాటళ్లను తరలిస్తుండగా పట్టుబడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్‌ చేసి బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఎక్సైజ్‌ సిబ్బంది ఉన్నారు.

Spread the love