– క్రీడాకారులను అభినందించిన ఆర్ సి ఓ మేరీ ఏసు పాదం..
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలం లోని ధర్మారం బి లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భారత సాఫ్ట్ బాల్ జట్టుకు ఎంపికైన క్రీడాకారులను ప్రాంతీయ అధికారిని మేరీ ఏసు పాదం అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అండర్- 15 భారత జట్టులో నిజామాబాద్ జిల్లా నుండి ఐదుగురు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు గోక సాత్విక, గోక శ్రావిక, గూగులోతు సౌందర్య సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల డిచ్ పల్లి మండలం లోని సుద్దపల్లి), దాసరి సరియు సాంఘిక సంక్షేమ పాఠశాల ధర్మారం), సుంకపాక సౌమ్య రాణి (సాంఘిక సంక్షేమ కళాశాల కామారెడ్డి జిల్లా తాడ్వాయి),ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఈనెల 13 నుండి 17 వరకు తైవాన్ దేశంలోని తైపిలో జరిగే ఏషియన్ చాంపియన్ షిప్ పోటీలలో భారత జట్టుని ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేయాలి మేరి ఏసుపాదం అన్నారు.ఎంపికైన ఐదుగురు క్రీడాకారులు రాష్ట్ర సాఫ్ట్ బాల్ అకాడమీ లోని ప్రత్యేక శిక్షణ పొందుతున్న క్రీడాకారులు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేలా కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ నీరజ రెడ్డి, తాడ్వాయి వ్యాయామ ఉపాధ్యాయురాలు సంధ్య, సాఫ్ట్ బాల్ అకాడమీ కోచ్ లు వేముల మౌనిక, ఇట్యాల నరేష్ లు పాల్గొన్నారు.