పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్స్ గా విద్యార్థినీ, విద్యార్థుల ఎంపిక

Selection of College Students as Public Safety Ambassadors– ఆరు విభాగాల్లో పబ్లిక్ సేఫ్టీ క్లబ్బుల ఏర్పాటు
– వాటి పనితీరు గురించి పూర్తిగా వివరించిన కలెక్టర్, ఎస్పీ 
నవతెలంగాణ –  కామారెడ్డి
కళాశాల స్థాయి, విద్యార్థిని విద్యార్థులకు, తల్లిదండ్రులు,  అధ్యాపకులకు  పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్స్ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలనే  ముఖ్య ఉద్ధేశ్యం తో పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో గల సత్య  కన్వెన్షన్ హాల్లో పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్స్  కార్యక్రమనీ శనివారం నిర్వహించరు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..  జిల్లా ఎస్పీ  పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్ అనే కార్యక్రమం ప్రజల కొరకు ఏర్పాటు చేయబడినదన్నారు. దీనిలో భాగంగా ఆరు అంశాలు కూడా చదువుకునే వయసు నుంచి అవలంబించుకుంటే విద్యార్థిని విద్యార్థులు మంచి నడవడిక తో పాటు తన చుట్టుపక్కల వారిని కూడా అదే పద్ధతిలో నడవడానికి ప్రయత్నిస్తారు. ఎవరైతే విద్యార్థులు ఈ అంబాసిడర్ గా  సెలక్షన్ అయినరో వాళ్ళు అదృష్టవంతులుగా భావించి బాధ్యతాయుతముగా మెలిగి మీ కళాశాలలో ఎలాంటి అవంచనీయ ఘటన జరగకుండా ఈ ఆరు క్లబ్బుల అంబాసిడర్స్ ఆరు విభాగాల్లో పని చేయాలన్నారు. జిల్లా ఎస్పీ ప్రత్యేక చోరువతో ఇలాంటి ప్రోగ్రాం చేయడం అనేది జిల్లా ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు అదృష్టంగా భావించి, బాధ్యతయుతంగా మెలగాలని పిలుపునిచ్చారు. అనంతరం  గౌరవ అతిథి జిల్లా  ఎస్పీ  మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో విద్యార్థులను, యువకులను  సేఫ్టీ అంబాసిడర్  గా ఎంచుకోవడానికి ముఖ్య కారణం  ఈ వయసులో సమాజానికి ఏదైనా మంచి పని చేయాలని బలమైన ఆలోచనతో పాటూ వారు చెప్పే ప్రతి మాటలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు సమాజం  ఎక్కువగా ఆకర్షితులకులోనై ఉంటారని, కాబట్టి వారిని ఈ సేఫ్టీ అంబాసిడర్లుగా నియమించుకోవడం జరిగిందన్నారు.  వారికి ప్రస్తుతం సమాజం పట్ల ఎలాంటి ముఖ్యమైన విషయాల్లో అవగాహన ఉండాలి అనేది ఆలోచించి ఈ ముఖ్యమైన ఆరు సేఫ్టీ విషయాల గురించి తెలియజేయాలని, ఈ ఆరు సేఫ్టీ క్లబ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
అందులో1.  సైబర్ సేఫ్టీ క్లబ్, 2. రోడ్ సేఫ్టీ క్లబ్, 3.  ఉమెన్ సేఫ్టీ క్లబ్,  4. ఆంటీర్యాగింగ్, ఆంటీ డ్రగ్ కమిటీ క్లబ్, 5. సోషల్ రెస్పాన్సిబిలిటీ క్లబ్ 6.  హెల్త్ అండ్  వెల్నెస్ క్లబ్.  ఇలా ఈ 6 సేఫ్టీ క్లబ్ లో  6గురు విద్యార్థులు, 4 గురు తల్లిదండ్రులు, 1  కళాశాల  అధ్యాపకులు లేదా ఫ్యాకల్టీని తీసుకోవడం జరిగిందన్నారు. ఇలా 21 కాలేజీల నుండి ఈ ఆరు సేఫ్టీ  క్లబ్ సుమారు 1000కి పైగా  నియమించడం జరిగిందన్నారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా వీరు పూర్తిగా నేర్చుకుని  తర్వాత ఈ విద్యార్థులు వారి కళాశాల యందు జరుగు కార్యక్రమాలలో అందరికీ ఈ ఆరు విషయాలపై పూర్తి అవగాహన  కల్పిస్తారన్నారు.  తర్వాత ఇలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తూ అందరికీ అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.   భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు మన భద్రత గురించి కూడా ఆలోచించాలి అని అందులో అందరూ భాగస్వాములు కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహకరించిన కళాశాల యాజమాన్యం విద్యార్థులకు అందరికి కూడా శుభాభినందనలు  తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లా ఎస్పీ  పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్ అనే కార్యక్రమం ప్రజల కొరకు ఏర్పాటు చేయబడినదన్నారు. దీనిలో భాగంగా ఆరు అంశాలు కూడా చదువుకునే వయసు నుంచి అవలంబించుకుంటే విద్యార్థిని విద్యార్థులు  మంచి నడవడిక తో పాటు తన చుట్టుపక్కల వారిని కూడా అదే పద్ధతిలో నడవడానికి ప్రయత్నిస్తారు. ఎవరైతే విద్యార్థులు ఈ అంబాసిడర్ గా  సెలక్షన్ అయినరో వాళ్ళు అదృష్టవంతులుగా భావించి బాధ్యతాయుతముగా మెలిగి మీ కళాశాలలో ఎలాంటి అవంచనీయ ఘటన జరగకుండా ఈ ఆరు క్లబ్బుల అంబాసిడర్స్ ఆరు విభాగాల్లో పని చేయాలన్నారు. జిల్లా ఎస్పీ  ప్రత్యేక చోరువతో ఇలాంటి ప్రోగ్రాం చేయడం అనేది జిల్లా ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు  అదృష్టంగా భావించి బాధ్యతయుతంగా మెలగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో, డీఎస్పీ కామారెడ్డి నాగేశ్వరరావు, సిఐలు చంద్రశేఖర్ రెడ్డి, రామన్,  ఎస్ఐలు, సందీపనీ కళాశాలల డైరెక్టర్ బాలాజీ రావు, ఆర్కే గ్రూప్ కళాశాల సీఈవో డాక్టర్ జయపాల్ రెడ్డి, మంజీరా కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, ప్రభుత్వ,  ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపల్,  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love