లాటరీ పద్ధతి  ద్వారా విద్యార్థుల ఎంపిక..

– అదనవు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
2024-25 విద్యా సంవత్సరం లో  బెస్ట్ అవైలబుల్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న గిరిజన విద్యార్థి, విద్యార్థులకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక తెలిపారు. బుధవారం క్రెడిట్ కార్యాలయంలో డ్రాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ 3,5, 8 తరగతులకు గాను  జిల్లాకు 31 సీట్స్ కేటాయించిందని  జిల్లాలో 3వ తరగతి కి సంబంధించి   110 దరఖాస్తులు, 5వ తరగతికి 126 దరఖాస్తులు అలాగే  8వ తరగతికి 94 దరఖాస్తులు   మొత్తం 330 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థిని, విద్యార్థుల కుటుంబ సభ్యుల సమక్షంలో  జిల్లా కలెక్టరేట్  సమావేశ మందిరం లో లాటరీ పద్ధతి ద్వారా 3వ తరగతిలో 16 మంది, 5వ తరగతిలో 8 మంది అలాగే 8వ తరగతిలో 7 మంది మొత్తం 31 మందిని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో  జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె. శంకర్,  సూపరిండెంట్, శ్రవణ్ కుమార్, డి.ఈ.ఓ కార్యాలయ  సూపరిండెంట్ పార్థ సారధి,  గిరిజన నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరు అయినారు.
Spread the love