కుట్టు మిషన్ శిక్షణతో మహిళల్లో ఆత్మస్థైర్యం నిండింది

నవతెలంగాణ – రాయపర్తి
ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషిన్ శిబిరంలో శిక్షణ పొందిన మహిళలకు ఆర్థిక ప్రగతి సాధిస్తామనే ఆత్మస్థైర్యం నిండిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం మండలంలోని మండల కేంద్రంలో, కాట్రపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిబిరాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలందరూ ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆర్థిక స్వాలంభన, మహిళా సాధికారత సాధ్యమని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ మహిళాలకు సహాయం చేస్తుంది అన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివించాలని సూచించారు. వారు చదువుకుంటేనే సమాజంలో గౌరవంతోపాటు ఆర్థికంగా ఎదిగి, ధైర్యంగా బతకగలుగుతారని వివరించారు. పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సహాయ సహకారాలు అందచేస్తా అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.
Spread the love