నిరుద్యోగ యువతకు చాలా మంచి శిక్షణా ఇచ్చి వాళ్ళు జీవితంలో స్థిరపడే ల స్వయం ఉపాధి కల్పిస్తున్నారని, ఈ శిక్షణల గురించి ఇతరులకు తెలపలని డిఅర్డిఓ, డిఅర్డిఎ పిడి చందర్ నాయక్ అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత శిక్షణా కార్యక్రమనికి ముఖ్య అతిథిగా పిడి చందర్ నాయక్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈసందర్బంగా అయన మాట్లాడుతూ ఆర్థిక అక్షరస్యత శిక్షణ లో ప్రభుత్వం అందిస్తున్న ఇన్సూరెన్స్, ఇతర ఆర్థిక లావాదేవీలు ,ఆర్థిక క్రమశిక్షణ మీద అరు రోజులపాటు ఉంటుందని, ఈ శిక్షణా లో నేర్చుకునే ప్రతి ఒక్క సమాచారం మీ గ్రామంలో ఉండే మహిళ సభ్యులకు అందించాలని సూచించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో చాలా రకాల శిక్షణలు జరుగుతూ ఉంటాయని, గ్రామాల్లో ఉండే నిరుద్యోగ యువతకు చాలా మంచి శిక్షణా ఇచ్చి వాళ్ళు జీవితంలో స్థిరపడే ల స్వయం ఉపాధి కల్పిస్తున్నారని, ఈ శిక్షణల గురించి అందరికీ తెలిసేలా చుడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్, సేర్ప్ అధికారి వెంకటేష్, డిపిఎం కామారెడ్డి రవీందర్, అల్ ఇండియా అఫిషియల్ వరలక్ష్మి, సిబ్బంది రామకృష్ణ, నవీన్ , అర్చన, నర్మదా, ఫరిధ తదితరులు పాల్గొన్నారు.