జోరుగా చేపల అమ్మకం

– మృగశిర కార్తీ ప్రారంభం
– మార్కెట్‌లోకి 5కేజీ నుంచి 10కేజీల చేపలు
– శనివారం భారీగా పెరిగిన అమ్మకాలు
– చేపలను బట్టి పెరిగిన రేట్లు
చేపల మార్కెట్‌లో శనివారం కొలాహలం కనిపించింది. మృగశీర సందర్భంగా చేపల మార్కెట్లకు జనం పొటెత్తారు. చేపల కొనుగోళ్ల కోసం ప్రజలు పెద్ద ఎత్తున మార్కెట్లకు వచ్చారు. మృగశిర కార్తీ ప్రారంభం కావడంతో ప్రజలు చేపలు కొనుగోలు చేశారు. మార్కెట్‌లోకి వివిధ రకాల చేపలు వచ్చాయి. ఒక్కో చేప సుమారు 5 కేజీల నుంచి పది కేజీల వరకు ఉంది. ప్రజలు ఎంతో ఇష్టంగా చేపలను కొనుగోలు చేశారు.
నవతెలంగాణ-గండిపేట్‌
మృగశిర కార్తీ శనివారం ప్రారంభం కావడంతో చేపల అమ్మకాలు జోరుగా సాగాయి. శనివారం గండిపేట మం డలం నార్సింగ్‌ మున్సిపాలిటీ మంచిరేవుల ఇటికన్‌ చెరు వులో మత్స్యకారుల సంఘం అధ్యక్షులు బండమీద ప్రవీణ్‌కుమార్‌ముదిరాజ్‌ ఆధ్వర్యంలో చేపలు పట్టి అమ్మారు. ప్రతి ఏడాది ఇటికన్‌ చెరువులో మత్స్యకారుల ఉపాధి కోసం చేప పిల్లలను వదులుతారు. మృగశిర కార్తీ రోజు ఆ చేపలు పట్టి అమ్ముతారు. శనివారం చేపల అమ్మ కాలు భారీగా జరిగాయి. మార్కెట్‌లోకి సుమారు 5కేజీల నుంచి పది కేజీల చేపలు వచ్చాయి. బొచ్చెలు, రవ్వులు, వివిధ రకాల చేపలు పెద్ద మొత్తంలో వచ్చాయి. కేజీ చేప రూ.300 వరకు ధర పలికింది. చేపల రకాలను బట్టి రేటు ఉంది. ప్రజలు పెద్ద మొత్తంలో చేపలను కొనుగోలు చేశారు. వారికి నచ్చిన చేపలను ఇష్టంగా కొనుగోలు చేశారు. మృగశిర కార్తీ రోజు తప్పకుండా చేపలు తినాలనే భావన ప్రజలందరికీ చేపలను కొనుగోలు చేశారు. ఇదిలా ఉంటే నార్సింగ్‌ మున్సిపాలిటీలో కొన్ని చెరు వుల్లో డ్రయినేజీ, కెమికల్స్‌ రావడంతో ఆ చెరువుల్లో చేప లను పట్టడం మత్స్యకారులు పూర్తిగా నిలిపివేశారు. చు ట్టుపక్కల పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లు రావడంతో చెరువులు కలుషితం అయ్యాయి. దాంతో ఉపాధి కోల్పోతున్నామని మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల్లోకి కలుషితమైన కెమికల్స్‌, డ్రయినేజీ రాకుండా చూడాలని మత్య్సకారులు కోరారు.

Spread the love