సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు తుమ్మల బిక్షం రెడ్డి మృతి

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని లక్నవరం గ్రామంలో బుధవారం సీపీఐ(ఎం) పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల బిక్షం రెడ్డి  వృద్ధాప్యంతో మృతి చెందడం జరిగింది.  ఈయన మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కూడి కృష్ణారెడ్డి  అన్నారు. పార్టీ నాయకత్వం బిక్షం రెడ్డి  భౌతికకాయంపై    ఎర్రజెండా కప్పి  నివాళులు అర్పించారు. అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది.సూడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ  తుమ్మల బిక్షం రెడ్డి  ఏజెన్సీ ప్రాంతంలో పార్టీ ములుగు డివిజన్ సెక్రెటరీగా పనిచేసినడని ఉమ్మడి జిల్లా జిల్లా కమిటీ సభ్యులుగా కూడా కొనసాగారు. ఏజెన్సీ ఏరియాలో గిరిజనుల, క దళితుల,  బడుగు బలహీన కోసం  అనేక పోరాటాలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషిచేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడరు. ఈ కష్టకాలంలో ఆయన యొక్క పాత్ర    కొనియాడానిది.అంతిమ యాత్రలో సీపీఐ(ఎం) పార్టీ సభ్యులు సానుభూతిపరులు   జిల్లా నలు మూలాల నుండి హాజరై నివాళులు అర్పించి అంతిమ యాత్ర కొనసాగించారు. ఈకార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బిరెడ్డి సాంబశివ, రత్నం రాజేందర్  జిల్లా కమిటీ సభ్యులు పొదిల్ల చిట్టిబాబు,వంక రాములు కుమ్మరి శీను, గ్యానం వాసు ఎండి దావూద్, గపూర్ భాష, ప్రవీణ్,బొచ్చు సంజీవ,కడారి నాగరాజు,కారం రజిత, మంచాల కవిత  ఉమ్మడి ఉపేంద్ర చారి, అంబాల మురళి, అంబాల పోశాలు, గుండు రామస్వామి, జిట్టబోయిన రమేష్, పిట్టల అరుణ్, సిరిపెల్లి జీవన్, పల్లపురాజు,కొమ్ము రాజు, పాయ్యం సరదా,సువర్ణ సంకినేని రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు
Spread the love