
నవతెలంగాణ – నూతనకల్
మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బిక్కి పుల్లయ్య గురువారం మృతి చెందాడు,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు జిల్లా కమిటీ సభ్యులు కందాల శంకర్ రెడ్డిలు మృతుని మృతదేహంపై ఎర్రజెండాను కప్పి పుష్పగుచ్చం నుంచి శ్రద్ధాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు . మృతునికి సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ అనంతుల రాఘవులు సిపిఎం జిల్లా నాయకులు పులుసు సత్యం మండల నాయకులు సామ వెంకట్ రెడ్డి, తోట్ల అచ్చయ్య, కందాల కృష్ణారెడ్డి, తొట్ల లింగయ్య, గజ్జల శ్రీనివాసరెడ్డి, గజ్జల సాయి రెడ్డి, బొజ్జ శ్రీను, పులుసు జనార్ధన్, బాణాల వెంకటరెడ్డి బాణాల విజయ్ రెడ్డి కూసు పరమేష్ తొట్ల రాములు ఎశమల్ల వెంకటయ్య జటంగి లింగయ్య తదితరులు ఉన్నారు