నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని సీనియర్ దళిత నాయకుడు కేశ్ పల్లి రవి హైదరాబాద్ లోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ దళితరత్న అవార్డు అందజేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ తరఫున దళిత జాతి సమస్యలపై కృషిచేసిన రవికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిటీ వైస్ చైర్మన్ శ్యాం కుమార్,జిల్లా అధ్యక్షులు నక్కీ విజయ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.